2019 సార్వత్రిక ఎన్నికల తరువాత బీజేపీ , వైసీపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరేనని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు . వైసీపీ , బీజేపీ నేతలు కలిసి సీఎం చంద్రబాబు పై కుట్ర చేస్తున్నాయని అన్నారు . నాడు గోద్రా అల్లర్లలో ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా మోదీ వ్యవహరించారని , దీనిని వ్యతిరేకించినందుకే చంద్రబాబు పై కుట్ర జరుగుతోందన్నారు . ప్రధాని మోదీ ఉన్నంతవరాకూ దేశ ప్రజలకు రక్షణ ఉండదని , దేశంలో మోదీ , రాష్ట్రంలో జగన్ ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు . మోదీ , అమిత్ షా లకు వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తో పారు ఆ పార్టీ నేతలు రాష్ట్ర సమాచారాన్ని అందిస్తున్నారని ఆరోపించారు . మోదీను గద్దె దించే దమ్ము కేవలం చంద్రబాబుకే ఉందని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments