వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజసంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది . ఈ సందర్భంగా జగన్ రావులపాలెంలో బహిరంగ సభలో మాట్లాడుతూ 2014 ఎన్నికల ముందు జాబు రావాలంటే బాబు రావాలని అన్నారని , కానీ ఇప్పటివరకు అమలు కాలేదని అన్నారు . ప్రతీ ఇంటికి చంద్రబాబు మనుషులను పంపి , ప్రతీ ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారని , ఒకవేళ కల్పించకపోతే నెలకు 2000 రూపాయల నిరుద్యోగ భ్రుతి ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు . నెలకు 2000 అంటే ఈ పాటకి 96,000 రూపాయలు చంద్రబాబు బాకీ పడ్డారని అన్నారు . ఈ నాలుగేళ్ళు చంద్రబాబుకు నిరుద్యోగులు గుర్తుకు రాలేదు కానీ ఎన్నికలకు కొన్ని నెలల సమయం ఉండగా నిరుద్యోగులు గుర్తుకోస్తున్నారన్నారని విమర్శించారు . అందుకే ఇప్పుడు నిరుద్యోగులను మభ్యపెట్టడానికి రూ . 1000 భ్రుతి ఇస్తామంటున్నారని అన్నారు .

ఇక ఫీజు రీయింబర్స్ మెంటు కూడా అరకొరగా ఇస్తున్నారని , అది కూడా చాలా మందికి అందడం లేదని అన్నారు . దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్ , డీజిల్ చార్జీలు ఎక్కువ మన రాష్ట్రంలోనే చంద్రబాబు హయాంలో ఉందని విమర్శించారు . ఇంత దారుణంగా మోసం చేస్తూ పరిపాలిస్తున్న ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉంటారా ? అని జగన్ ప్రశ్నించారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments