ఇటీవల అవకాశం దొరికినప్పుడల్లా ఏపీ సీఎం చంద్రబాబు పై విరుచుకుపడుతున్నారు బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు . తాజాగా ఆయన మరోసారి చంద్రబాబు పై ధ్వజమెత్తారు . ఈరోజు ఉదయం రాజమహేంద్రవరంలో జరిగిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రజా సంక్షేమం నిమిత్తం పలు పధకాల కొరకు వేల కోట్ల రూపాయలను రాష్ట్రానికి నిధుల రూపంలో ఇస్తుంటే , చంద్రబాబు ఆ నిధులను ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారని ఆరోపించారు .

గృహ నిర్మాణ పధకాల నిమిత్తం కేంద్రం ఇచ్చిన నిధుల్లో దాదాపు రూ . 30 వేల కోట్లను చంద్రబాబు దోచేస్తున్నారని అన్నారు . ఉపాధి హామీ పధకం కోసం కేంద్రం ఇచ్చిన నిధుల్లో రూ . 13 వేల కోట్లను దోచుకున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు . ఈ మొత్తం అవినీతిపై సీబీఐ కి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments