మానవత్వాన్ని మేలుకోలిపేది రంజాన్ …

1152

రంజాన్ పండుగ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు . ఈ మేరకు జనసేన పార్టీ తరపున ఒక ప్రకటన విడుదల చేశారు . మానవత్వాన్ని మేలుకోలిపేది , మానవులను మంచిగా బతకమని చెప్పేది రంజాన్ అని అన్నారు . “విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పేది రంజాన్ , ఇటువంటి గొప్ప సందేశాన్ని అందించే రంజాన్ మాసాన్ని ఎంతో నిష్టతో ఆదరించే ముస్లిం సోదర , సోదరీమణులకు అందరికీ నా తరపున , జనసైనికుల తరపున రంజాన్ శుభాకాంక్షలు . భారత దేశంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ రంజాన్ పండుగ స్ఫూర్తిని ప్రతీ ఒక్కరూ ఆదరించాలని మనస్పూర్తిగా ఆశిస్తూ , ఈ రంజాన్ పండుగ దేశ ప్రజలందరికీ శుభాలను అందించాలని కోరుకుంటున్నాను ” అని పవన్ పేర్కొన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here