యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ మరో సారి తండ్రి అయ్యారు . గురువారం జూన్ 14 న ఎన్ఠీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు . ఈ విషయాన్ని ఎన్ఠీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు . ఆయన ట్వీట్ చేస్తూ “నా కుటుంబం మరింత పెద్దదయ్యింది , బాబు పుట్టాడు ” అని అన్నారు . దీంతో అభిమానులు , ప్రముఖులు అందరూ ఎన్ఠీఆర్ కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేసారు . తల్లి , బిడ్డ క్షేమంగా ఉన్నట్టు రెయిన్ బో ఆసుపత్రి వైద్యులు తెలిపారు . ఎన్ఠీఆర్ తన కొడుకును డాక్టర్ల సంరక్షణలో చూసుకున్నారు . ఈ సందర్భంగా అక్కడ ఉన్న డాక్టర్లు ఎన్ఠీఆర్ తో సెల్ఫీ దిగారు . ఇప్పుడు ఈ సెల్ఫీలే సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments