వైసీపీ ఎంతో ఇష్టంగా అడిగే ప్రశ్నకు సమాధానం దొరికింది …

759

ఏపీలో ఉద్యోగాలు ఎక్కడున్నాయ్ ? అని వైసీపీ నేతలు ఇష్టంగా అడిగే ప్రశ్నకు సమాధానం దొరికిందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు . శుక్రవారం ఆయన ట్వీట్ చేస్తూ “ఏపీలో ఉద్యోగాలు ఎక్కడున్నాయ్ ? అనే వైసీపీ కి ఇష్టమైన ప్రశ్నకు సమాధానం దొరికింది . వైసీపీ ఎంపీ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు మినిస్ట్రీ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఇచ్చిన సమాదానపు లేఖను ఇక్క జతపరుస్తున్నాను . ఇందులో ఉన్న లెక్కలు తప్పా ? అందువల్లనే చంద్రబాబునాయుడు మిమ్మల్ని అసెంబ్లీ బాయ్ కాట్ చేయొద్దని రిక్వెస్ట్ చేసేది . ” అని పేర్కొన్నారు .

మరొక ట్వీట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక బస్సు ఏర్పాటు చేసి , ఇండస్ట్రీస్ మంత్రి వ్యక్తిగతంగా వైసీపీ నేతలను రాష్ట్రంలో ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఏర్పాటు చేశారో , ఉద్యోగాలు ఎక్కడైతే కల్పించారో చూపిస్తారు . ఇందుకు వాళ్ళు సిద్ధమేనా ? అని వైసీపీ నేతలను ఉద్దేశించి నారా లోకేష్ పేర్కొన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here