క్రికెటర్ గా నాని …

595

కొన్ని సంవత్సారాలుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో న్యాచురల్ స్టార్ నాని . ప్రష్టుతం ఆయన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున తో కలిసి మల్టీస్టారర్ లో నటిస్తున్నారు . ఇప్పటికే ఈ సినిమా కొంత మేర చిత్రీకరణ జరుపుకుంది . అయితే ఇప్పుడు నాని తదుపరి సినిమా గురుంచి స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు .

ఈ పోస్టర్ ను మనం గమనిస్తే ఈ సినిమా క్రికెట్ నేపధ్యంలో సాగుతుందని తెలుస్తోందని . నాని ఈ సినిమాలో క్రికెటర్ కనిపించనున్నట్టు తెలుస్తోంది . ఈ సినిమాకి జర్నీ అనే టైటిల్ ను ఖరారు చేశారు . సితార ఎంటర్టైన్మెంట్స బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకి గౌతం దర్శకుడిగా వ్యవహరించనున్నారు . ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here