టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు కొన్ని రోజులుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై తీవ్ర విమర్శలకు దిగుతున్న విషయం తెలిసినదే . తాజాగా ఆయన మళ్ళీ చంద్రబాబు పై విమర్శలు చేశారు . ఆయన మాట్లాడుతూ తాను ఈ విధంగా మాట్లాడడానికి కారణం చంద్రబాబే అని , మహానాడుకు తనను ఆహ్వానించి ఉంటె ఈ విషయాలన్నీ లోపలే మాట్లాడేవాడినని అన్నారు . తాను అమ్ముడుపోయే మనిషిని కానని , అనుకున్నది సాధించే వరకూ పోరాటాం చేసే మనిషినని అన్నారు . చంద్రబాబు దొరకని దొంగని , ఆయన పేరు మోసగాడు అని , నమ్మే వాళ్ళను గొంతు కోసే నమ్మకద్రోహి అని మోత్కుపల్లి నిప్పులు చెరిగారు . ఆరోజున తాను ఎన్ఠీఆర్ ఘాట్ వద్ద ఏడిస్తే ఎందుకు ఫోన్ చేయలేదని చంద్రాబును సూటిగా ప్రశ్నించారు మోత్కుపల్లి .

ఇంకా మాట్లాడుతూ “ఒక వ్యవస్థే సృష్టించినటువంటి సృష్టికర్తను చంపిన నరహంతకుడు నువ్వు . నువ్వు పవన్ కళ్యాణ్ ను వాడుకొని వదిలెయ్యలేదా ? నాడు పవన్ కళ్యాణ్ ఇంటికి నువ్వు వెళ్ళావా ? నీ ఇంటికి పవన్ వచ్చాడా ? గెలిచినా తరువాత పవన్ ను బయట పడేశావు ? ఇది న్యాయమా ? నాడు ప్రధాని మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి పవన్ ని పిలిచారు. ఏదైనా పదవి కావాలా? అని కూడా పవన్ ని అడిగారు. ఏ పదవీ పవన్ కల్యాణ్ తీసుకోలేదు. ఈ విషయాన్ని ప్రశంసించాలి కదా!’ అన్నారు. “

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments