శ్రీమంతుడు , జనతా గ్యారాజ్ , భరత్ అనే నేను వంటి సామాజిక స్పృహ కలిగిన సినిమాలు రూపొందించారు దర్శకుడు కొరటాల శివ . ఈరోజు ఆయన పుట్టినరోజు . ఈ సందర్భంగా అనేక మంది ప్రముఖులు , అభిమానులు ఆయనకు సామాజిక మాధ్యమాల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు . టాలీవుడ్ అందగాడు , సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షాలు తెలిపారు . “నా ప్రియ మిత్రుడు , స్వతంత్ర దర్శకుడు కొరటాల శివ గారికి జన్మదిన శుభాకాంక్షలు . మీకు  జీవితాంతం సంతోషంగా , విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నా . మీపై ఎప్పుడు గౌరవ భావం కలిగి ఉంటాను ” అని కొరటాల శివను ఉద్దేశించి మహేశ్ ట్వీట్ చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments