విభజన హామీల అమలు కోసం వచ్చే పరిలిఅమేంట్ సమావేశాల్లో పోరాడతామని , ఉద్యమంలో వైసీపీ సహా అందరితో కలిసి పోరాడేందుకు ఎంపీ కొనకళ్ళ నారాయణ తెలిపారు . కేంద్రం పై అవిశ్వాసం పెట్టి సభను స్తంబింపచేస్తామని అన్నారు . విభజన హామీలు నెరవేర్చే వరక్కు ఎట్టి పరిస్థితులలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు . వైసీపీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ తన నాన్న పేరిట ఉన్న జిల్లాకు స్టీల్ ప్లాంట్ రాకపోతే ఏమీ మాట్లాడడం లేదని , దీని బట్టి జగన్ సమర్ధత ఏంటో తేలిపోయిందన్నారు . కడప స్టీల్ ప్లాంట్ ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేశాక బీజేపీ తో ఇంకా వైసీపీ నేతల మంతానాలేంటని కొనకళ్ళ ప్రశ్నించారు .

కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఈ నెల 20 న కడప ఎంపీలతో ఆందోళన చేస్తామని , విశాఖ రైల్వే జోన్ కోసం ఈ నెల 27 న విశాఖ లో ఆందోళన చేస్తామని తెలియజేశారు . వెనకబడిన జిల్లాలకు జరిగిన అన్యాయంపై వచ్చే నెల 4 న అనంతపురంలో నిరసన చేపడతామని , రాజధానికి కేంద్రం చేస్తున్న అన్యాయం పై వచ్చే నెల 11 న ఆందోళన చేస్తామని , తమ పోరాటాలకు వైసీపీ అడ్డుపదోద్దని కొనకళ్ళ కోరారు . కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా తామందరూ సంఘీభావ దీక్షలు చేపడతామని కొనకళ్ళ నారాయణ ఈ సందర్భంగా ప్రకటించారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments