ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కు హైకోర్టులో ఊరట లభించింది . కేసు విచారణకు హాజరుకావాలంటూ కరీంనగర్ కోర్టు జారీ చేసిన కోర్టు ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది . గతంలో ఓ ఛానెల్ కు కోడెల ఇంటర్వ్యూ ఇస్తూ తాను ఎన్నికల కోసం దాదాపు రూ . 11. 50 కోట్లు ఖర్చు చేశానని పేర్కొనడంతో ఇంత మొత్తంలో ఖర్చు చేయడం ఎన్నికల నిబంధనకు విరుద్ధమంటూ కరీంనగర్ వావిలాలపల్లికి చెందిన భాస్కర్ రెడ్డి గతేడాది కోర్టులో ప్రైవేటు కేసు వేశారు . దీనికి పరిగణలోకి తీసుకున్న కరీంనగర్ కోర్టు విచారణకు హాజరు కావాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది . దీంతో కోడెల ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించారు . విచారణ జరిపిన ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం . సత్యనారాయణమూర్తి కరీంనగర్ జిల్లా జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments