ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 17 న ఢిల్లీ వెళ్లనున్నారు . ఆ రోజున జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు . నిజానికి ఈ సమావేశం 16 న జరగవలసి ఉండగా రంజాన్ దృష్ట్యా 17 న కానీ 18 న కానీ నిర్వహించాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కు చంద్రబాబు లేఖ రాశారు . ఈ లేఖకు స్పందించి రాజీవ్ కుమార్ 17 న సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు . ఇదే సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments