బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ , వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న డిల్లీ ఏపీ భవన్ లో సమావేశమైనట్టు వార్తలు వచ్చాయి . ఈ విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు . శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తో తాను సమావేశమైనట్టు వస్తున్న వార్తలలో అబద్ధమని చెప్పారు . తాను వ్యక్తిగత పనుల మీద డిల్లీ వెళ్లానని అన్నారు . తాను ఏపీ భవన్ కు వెళ్లేసరికి అన్ని పార్టీలకు సంబందించిన ఎమ్మెల్యేలు ఉన్నారని , బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ , టీడీపీ విప్ కూన రవికుమార్ లు కలిసారన్నారు . టీడీపీ విప్ అయిన రవికుమార్ తనను ఆలింగనం చేసుకున్నారని , మరీ ఈ వీడియో ఎందుకు చూపట్లేదని మండిపడ్డారు . ఒక టీడీపీ విప్ ఆలింగనం చేసుకుంటే వైసీపీ లో చేరుతునట్లేనా అని ప్రశ్నించారు . సత్యనారాయణ తో కలిసి భోజనం చేస్తేనే ఇంత ఉలిక్కి పడుతుంటే , నిజంగా కలిస్తే ఏమైపోతారని టీడీపీ ని ఉద్దేశించి విమర్శించారు . అతిధి గృహం లాబీలో ఇద్దరు ఎమ్మెల్యేల జరిగిన ఒక మర్యాద పూర్వకమైన సన్నివేశం చుట్టూ ఓ కథ అల్లడం టీడీపీ అబధ్రతా భావానికి నిదర్శనమని , వైసీపీ నేతలు ఎవరిని కలిసినా టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో , అసలు ఏం జరిగిందని ఇంతా ప్రచారం చేస్తున్నారు అని ప్రశ్నించారు .

ఇంకా మాట్లాడుతూ మెదడు లేని అచ్చెన్నాయుడు ఎలా మంత్రి అయ్యారో అర్ధం కావడం లేదన్నారు . మరోవైపు చూస్తే లోకేశ్ చాలా అమాయకులుగా ఉన్నారని , ఆయన ట్వీట్లు చూస్తుంటే తనకున్న పప్పు బిరుదును పోగొట్టుకోవడానికి ఎదుటివారిపై బురదజల్లే ఆటలో దిగినట్టుందని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు . ఒక పార్టీ నేత మరో పార్టీ నేతను రాజ్యాంగం లో ఏదైనా చట్టముండా అని ప్రశ్నించారు . సిఎం చంద్రబాబు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని , ఏం చేస్తున్నారో ఆయనకే అర్ధం కావడం లేదని , టీడీపీ నాయకుల మానసిక స్థితి ఉన్మాదానికి చేరిపోయిందని విమర్శించారు .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments