నిజం చెప్పాలంటే ఇబ్బంది పడ్డా …

828

అటు బుల్లితెర ప్రేక్షకులకు , ఇటు వెండితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు అనసూయ . యాంకర్ గా అడుగుపెట్టి ఇప్పుడు సినిమాలలో మంచి పాత్రలు చేస్తూ మంచి సక్సెస్ తో దూసుకుపోతున్నారు . ఇటీవల విడుదలైన రంగస్థలం సినిమాలో ఆమె చేసిన రంగామత్త పాత్ర తో సకల ప్రేక్షకుల ఆదరణ పొందారు . దీనితో ఆమెకు సినిమాలలో డిమాండ్ పెరిగి క్యారక్టర్లు క్యూ కడుతున్నాయ్ . ఎప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆక్టివ్ గా ఉండే ఆమె తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించారు .  ఈ సందర్భంగా ఒక అభిమాని మాత్రం ఒక విభిన్నమైన ప్రశ్న వేశాడు . “మేడం మీరు రంగస్థలం లో మీ ఏజ్ కి మించిన క్యారెక్టర్ చేసారు కదా , ఎప్పుడు ఇబ్బంది పడలేదా” అని అభిమాని అడగగా అనసూయ దానికి సమాధానమిస్తూ “నిజం చెప్పాలంటే ఇబ్బంది పడ్డాను . కానీ ఒక్కసారి యాక్సెప్ట్ చేస్తే వదిలే టైపు కాదు నేను , నా భయమంతా డబ్బింగ్ చేసేటప్పుడు పోయింది ” అని అన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here