తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కలిసారు . విజయసాయి రెడ్డి ఇటీవల ఒక విలేఖరుల సమావేశంలో తాను మోత్కుపల్లి ని కలిస్తే తప్పేంటని , కచ్చితంగా తాను కలుస్తానని చెప్పిన విషయం తెలిసినదే . వారిద్దరూ దాదాపు 40 నిమిషాలపాటు చర్చలు జరిపారు . మోత్కుపల్లి నర్సింహులు చేపట్టనున్న తిరుమల యాత్రకు వైసీపీ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మోత్కుపల్లి తో అన్నారు .

బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మోత్కుపల్లి మాట్లాడుతూ తిరుమల వెంకన్నను దర్శించుకొని చంద్రబాబును ఓడించమని కోరతానన్నారు . వచ్చే ఎన్నికలలో చంద్రబాబుకు ఏపీ ప్రజలు గుణపాఠం చెప్తారని , టీడీపీ ఓటమి తధ్యమని నిప్పులు చెరిగారు . అయితే నిన్న మోత్కుపల్లి వ్యాఖ్యలు చేయడం , ఇవాళ విజయసాయి రెడ్డి ఆయనను కలుసుకున్న నేపధ్యంలో రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments