హింసాత్మక దృశ్యాలు ఎక్కువగా ఉండే టీవీ సీరియల్స్ ను నిషేదించాలని కోరుతూ కోర్టుకు వెళతానని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు . ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం పై తాను ప్రధాని నరేంద్ర మోదీకి , కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు . సామాజిక మాధ్యమాలలో అశ్లీల దృశ్యాలను నిరోధించడానికి కృషి చేస్తామని , మద్యపానం వల్లనే మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నాయని , వీటి అమ్మకాల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు . మహిళా చట్టాలపై అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తామని నన్నపనేని రాజకుమారి ఈ సందర్భంగా తెలిపారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments