టీమిండియా తన టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది . టెస్ట్ క్రికెట్ హోదా సంపాదించిన ఆసియా దేశం ఆఫ్ఘనిస్తాన్ తో బెంగళూరు చిన్నస్వామీ స్టేడియం లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఈ ఘనత సాదించింది . టాస్ గెలిచినా ఇండియన్ టీం బాటింగ్ ను ఎంచుకుంది . లంచ్ సమయానికి ఇండియన్ టీం 27 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 158 పరుగులు చేసింది . శిఖర్ ధావన్ (104 బ్యాటింగ్ : 91 బంతులలో 19 ఫోర్లు , 3 సిక్సర్లు) , మురళీ విజయ్ (41 బ్యాటింగ్ 72 బంతులలో 6 ఫోర్లు , 1 సిక్స్) తో బాధ్యాతాయుతమైన ప్రారంభాన్ని అందించారు .

టెస్టు మ్యాచ్ లో తొలి రోజు బ్యాటింగ్ చేసిన జట్టులో లంచ్ కు ముందే సెంచరీ చేసిన అరుదైన ఘనతను మన జట్టు తొలిసారి సాధించింది . ధావన్ 87 బంతులలో సెంచరీ నమోదు చేయడం తో భారత్ ఈ ఫీట్ ను సొంతం చేసుకుంది . ఇప్పటి వరకూ ఈ ఘనతను ఏ భారత ఆటగాడు సాధించలేకపోయారు . 2006 లో సెయింట్ లూసియాలో వెస్ట్ఇండీస్ తో జరిగిన మ్యాచ్ లో సెహ్వాగ్ చేసిన 99 పరుగులు ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోరు .

లంచ్ కు ముందే సెంచరీ చేసిన జాబితాలో చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు , ఇప్పుడు వీళ్ళ సరసన ధావన్ చేరారు . ఇప్పటి వరకు ఈ జాబితాలో వి ట్రంపర్(1902) , సి మకార్ట్నీ(1921) , బ్రాడ్ మన్(1930) , మజిద్ ఖాన్ (1976) , డేవిడ్ వార్నర్ (2017) లు ఉన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments