దేశ రాజకీయాలలో కొత్త ట్రెండ్ ను మహారాష్త్ర నవ నిర్మాణ సేన పార్టీ చూపిస్తోంది . ఈరోజు పార్టీ చీఫ్ రాజ్ ఠాక్రే  జన్మదినాన్ని పురస్కరించుకొని మహారాష్ట్రలోని 48 పెట్రోల్ బంకులలో లీటర్ కు రూ . 4 చొప్పున తగ్గించి మరీ అమ్మకాలు జరిపిస్తోంది . ముంబై లోని 36 పెట్రోల్ బంకులలో , ఇతర ప్రాంతాలలో 12 చోట్ల ఈ అవకాశం కల్పించింది . అయితే ఈ తగ్గింపు కేవలం ద్విచక్ర వాహదారులకు మాత్రమే . ఇలా తగ్గించి అమ్మకాలు జరపడం వల్ల పెట్రోల్ బంకులకు ఎంత మేర నష్టం వస్తుందో ఆ మొత్తాన్ని ఎంఎస్ఎస్ పెట్రోల్ బంకులకు చెల్లిస్తుంది .  అయితే కొన్ని చోట్ల రూ . 9 మేర వరకు తగ్గించి పెట్రోల్ అమ్ముతున్నట్టు సమాచారం. రాజకీయ పార్టీల కార్యకర్తలు, నేతలు తమ పార్టీ అధ్యక్షుడి పుట్టిన రోజున పేదవారికి ఏవైనా ఉచితంగా అందించే కార్యక్రమాలు చేయడం చూశాం. కానీ, ఎంఎన్ఎస్ మాత్రం కొత్త విధానాన్ని పరిచయం చేసింది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments