భారీ బడ్జెట్ తో ప్రతిష్ఠాత్మకంగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య పాత్రలో రూపొందుతున్న సినిమా సైరా . సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు . ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన కొన్ని పోరాట సన్నివేశాలను హాలీవుడ్ స్టంట్ మాస్టర్ పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నారు . ఒక నెలలో ఈ షెడ్యూల్ ను పూర్తి చేసుకొని , కొంత సమయం విరామం తీసుకొని మరొక షెడ్యూల్ షూటింగ్ చిత్రబృందం ప్రారంభించనుంది .

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నిహారిక ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించనున్నారట . సురేందర్ రెడ్డి ఈ పాత్రకి తనను ఎంపిక చేయడంతో నిహారిక సంతోషానికి అవధులు లేకుండా పోయాయి . ఈ చిత్రంలో మరి కొన్ని ముఖ్య పాత్రలలో అమితాబ్ బచ్చన్ , జగపతి బాబు , విజయ్ సేతుపతి నటిస్తున్నారు . కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాంచరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసినదే .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments