జీవితం కొన్ని అనుకోని సంఘటనలు జరిగి చాలా బాధపెడుతుంటాయి . అటువంటి సంఘటనే చైనా లో చోటు చేసుకుంది . ఎంతో ముచ్చటపడి కొనుక్కున బీఎండబ్యూ కారు అగరబత్తుల కారణంగా కొన్న రోజే అగ్నికి ఆహుతి అయ్యింది . వివరాలలోకి వెళితే చైనాలోని యాంగ్యూ ప్రాంతంలో ఒక వ్యక్తి  సుమారు 50 లక్షల రూపాయలు వెచ్చించి బీఎండబ్యూ కారును కొని పార్కింగ్ లో ఉంచాడు . అయితే ఆ ప్రాంతంలో కొందరు పిల్లలు అగరబత్తీలు వెలిగించడంతో గాలికి నిప్పురవ్వలు ఎగిరి కారుకు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి . దీంతో ఆ కారు యజమాని లబోదిబోమన్నాడు . మంటలు ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది . ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు . ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments