కమ్మ కులంలో చెడపుట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడంటూ టీ-టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోత్కుపల్లితో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు భేటీ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోత్కుపల్లి మాట్లాడుతూ, ‘కమ్మ కులానికి చెడ్డపేరు తెచ్చేటటువంటి వ్యక్తి చంద్రబాబునాయుడు గారు. ఒక్క విషయాన్ని గుర్తించాలి. ఏ పదవి అయినా నువ్వు (చంద్రబాబు) ఇస్తే తప్ప, నేను ఎన్నడైనా  అడిగానా? చంద్రబాబుకు దమ్ముంటే నేరుగా మాట్లాడాలి. మీడియా ద్వారా నా తప్పేంటో చెప్పు? నీ సంగతేంటో నేను చెబుతాను.. నువ్వొక బ్రోకర్ వి, దందా కోరువి.. అల్లుడి వేషంలో ఎన్టీఆర్ ని చంపి పార్టీ జెండా ఎత్తుకుపోయిన దొంగవు నువ్వు…’ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

‘టీడీపీ జెండా నందమూరి వారిది. సొంత జెండా జగన్ ది. సొంత జెండా పవన్ ది. సొంత జెండా కేసీఆర్ ది. దమ్మూ ధైర్యం ఉంటే ఎన్టీఆర్ జెండాను పక్కనబెట్టి నీ సొంత జెండాతో పోటీ చెయ్యి. టీడీపీకి ఈరోజున కూడా ఓట్లు వస్తున్నాయంటే.. ఎన్టీఆర్ ని చూసి, ఆ జెండాను చూసి. ఎన్టీఆర్ బొమ్మ పెట్టి..వర్థంతులు చేసి గెలవాలని చంద్రబాబు చూస్తున్నాడు. ప్రజలు ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పటి జనరేషన్ కు ఈ విషయం అర్థం కావాలని నేను చెబుతున్నా. ఏది ఏమైనా నా గొంతు ఎన్టీఆర్ కోసం, ఆయన ఆశయ సాధనం కోసం, అంబేద్కర్ ఆలోచనా విధానం కోసం’ అని చెప్పుకొచ్చారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments