తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బేగుంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో డిల్లీ బయలుదేరారు . నాలుగు రోజుల పాటు డిల్లీలోనే ఉండనున్నారు . తన పర్యటనలో భాగంగా రేపు మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అవుతారు . ఈ భేటీలో తెలంగాణలో ఏర్పాటు చేసిన కొత్త జోనల్ వ్యవస్థ , కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న ముస్లిం , ఎస్టీల రిజర్వేషన్ల కోటా పెంపు వంటి పలు అంశాలపై కేసీఆర్ చర్చించనున్నారు . అలాగే దేశంలో గుణాత్మక మార్పు కోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు పై పలువురు నేతలతో ఆయన కేసీఆర్ సంప్రదింపులు జరుపుతారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments