చారిత్రక టెస్టు మ్యాచ్ ప్రారంభం …

0
218

భారత్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య చారిత్రిక ఏకైక టెస్టు మ్యాచ్ కొద్ది సేపటిలో ప్రారంభం కానుంది . బెంగలూరు చిన్నస్వామీ స్టేడియం లో ఈ మ్యాచ్ జరగనుంది . ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకుంది . మెడ నొప్పి కారానంగా ఈ మ్యాచ్ కు విరాట్ దూరమవ్వడంతో అజింక్యా రహానే ఈ టెస్టుకు సారధ్యం వహిస్తున్నారు .

టాస్ అనంతరం రహానే మాట్లాడుతూ, వికెట్ బ్యాటింగుకి అనుకూలంగా ఉండడం వల్లే బ్యాటింగ్ ఎంచుకున్నట్టు చెప్పాడు. గడ్డి మీద కొంచెం పచ్చిక ఉన్నప్పటికీ తాము తొలుత బ్యాటింగ్ చేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నాడు. ఆటగాళ్లు అందరూ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారని, చారిత్రక టెస్టును కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.

ఆఫ్గనిస్థాన్ కెప్టెన్ అస్ఘర్ స్టానిక్ జై మాట్లాడుతూ తొలి టెస్టు ఆడుతున్నట్టు గర్వంగా ఉందన్నారు. తమకు తొలుత బౌలింగ్ చేసే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉందన్నాడు. ఆటగాళ్లందరూ విజయం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here