తిరుపతి సీటు బీజేపీ కి ఇచ్చి తప్పు చేశాం …

0
189

వైఎస్సార్ కాంగ్రెస్‌పై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు తీవ్ర ఆరోపణలు చేశారు. ఓడిపోతామనే భయంతోనే ఆ పార్టీ ఎంపీలు రాజీనామా డ్రామాలు ఆడారని అన్నారు. ఉప ఎన్నికలు వస్తే ఆ పార్టీ నేతలు చిత్తుగా ఓడిపోయి ఉండేవారని పేర్కొన్నారు. బీజేపీతో కుమ్మక్కైన ఆ పార్టీకి ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీకి కూడా వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని పేర్కొన్న చంద్రబాబు.. గత ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు సీటును ఆ పార్టీకి ఇచ్చి పెద్ద  తప్పు చేశామన్నారు.

తిరుపతి సీటును బీజేపీకి కేటాయించడం వల్ల తాము దెబ్బతినాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.  వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా పనిచేస్తే తిరుపతి ఎంపీ సీటుతోపాటు ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీ విజయం తథ్యమని జోస్యం చెప్పారు. తిరుపతి నేతలతో సమావేశం సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here