వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసినదే . అయితే ఈ విషయం పై  వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు స్పందించారు  గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మించక పోవడం అన్యాయం అని ఆన్నారు . నాలుగు ఏళ్ళు కేంద్రం తో కలిసునప్పుడు ప్రశ్నించకుండా ఇప్పుడు ఎందుకు టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని అన్నారు . కడపలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని కేంద్రం ఇప్పుడు చెప్తోందని ,  అంతక ముందు విభజన చట్టంలో ని 13 వ షెడ్యూల్ లో ఆరు నెలలో ఉక్కు పరిశ్రమం నిర్మాణం చేపడతామని  ఉందని అన్నారు . ఎన్డీఏ లో భాగాస్వామ్యులైనంత కాలం టీడీపీ ఈ విషయం గురుంచి మాట్లాదలేదన్నారు . టీడీపీ నేతల వ్యవహారం చూస్తుంటే దొంగలు పడ్డ ఆరు నెలలకు మొరిగినట్టు ఉందని విమర్శించారు .

ఇంకా మాట్లాడుతూ ప్రధాని మోదీ , ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు . విభజన హామీలపై చివరిదాకా పోరాడేది కేవలం వైసీపీ ఏ నని , కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు టీడీపీ దొంగ దీక్షలు చేస్తూ డ్రామాలాడుతోందని అన్నారు . ప్రజలు మంత్రి సోమిరెడ్డి ని తిరస్కరించారని , జగన్ ను విమర్శించే స్థాయి ఆయనకు ఉందా అని ప్రశ్నించారు . టీడీపీ నేతలు ముందు కుస్తీ పొటీలని ఆ తరువాత మోదీ కాళ్ళు పట్టుకున్తారని ఎగ్దేవా చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments