టాలీవుడ్ హీరో నాని పై నటి శ్రీరెడ్డి పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసినదే . దీనికి సంబంధించి నాని తన లాయర్ల ద్వారా శ్రీరెడ్డి కి లీగల్ నోటీసులు పంపడం , దానికి తాను కూడా చట్టపరంగా పోరాటం చేస్తానని శ్రీరెడ్డి పేర్కొనడం విదితమే . ఈ వివాదం పై నటుడు విశాల్ స్పందించారు . ఆయన మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కోచ్ ఉందని ఒప్పుకుంటాను కానీ ప్రముఖ వ్యక్తులను టార్గెట్ చేసుకొని ఆరోపణలు చేయడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు . తనకు నాని బాగా తెలుసునని , మంచి స్నేహితుడని అన్నారు . తన వ్యక్తిగత కారణాల రీత్యా నానీ కి మద్దతు తెలపడం లేదని , మహిళల పట్ల నాని ఎంత మర్యాదగా వ్యవహరిస్తారో ఆయన గురుంచి తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయం తెలుసునని అన్నారు .

శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలలో నిజం ఉంటే కనుక ఆధారాలు చూపాలని , వారి పేర్లు మాత్రం బయటపెడితే సరిపోదన్నారు . శ్రీరెడ్డి వ్యవహారం మొత్తం గమనిస్తే ఆమె ఇతరులపై ఇష్టం వచ్చినట్టు టార్గెట్ చేస్తోందని , భవిష్యత్తులో తనను కూడా టార్గెట్ చేయవచ్చేమో అని విశాల్ పేర్కొన్నారు . ఇంకా మాట్లాడుతూ మన దేశంలో లైంగిక వేధింపుల నిరోధానికి సరైన చట్టాలు లేవన్నారు . ఏ మహిళైనా లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తే చట్టం దానిని మాత్రమే పరిగణలోకి తీసుకుని వారికి మద్దతు నా నిలుస్తోందని , ఇది సబబు కాదని అభిప్రాయపడ్డారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments