ఊపిరిత్తిత్తుల సమస్యతో మాజీ ప్రధాని , భారత రత్న వాజపేయి రెండు రోజుల క్రితం చికిత్స నిమితం డిల్లీ ఎయిమ్స్ లో చేరిన విషయం తెలిసిందే . వాజపేయి స్పందిస్తున్నారని , యాంటిబయోటిక్స్ ఇస్తున్నామని , ఆయన పరిస్థితి నిలకడా ఉందని మంగళవారం ఉదయం ఎయిమ్స్ వర్గాలు బులిటెన్ ను విడుదల చేశాయి . వాజపేయి ఆరోగ్యపరిస్థితిని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరా పర్యవేక్షణలో ప్రత్యేక వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని పేర్కొన్నారు. అయితే, సాయంత్రం ఆస్పత్రి వర్గాలు ఎలాంటి బులెటిన్‌ విడుదల చేయకపోవడం గమనార్హం. వాజపేయికి ఉన్న ఏకైక కిడ్నీ, ఊపిరితిత్తులు అంతంత మాత్రంగా పనిచేస్తున్నాయని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మాజీ ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, దేవెగౌడ, ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌, కేంద్రమంత్రులు జేపీ నడ్డా, అశ్విన్‌ కుమార్‌ చౌబే, సాధ్వీ నిరంజన్‌ జోషి, అనంత్‌ గీతే, మాజీ మంత్రి మురళీ మనోహర్‌ జోషి మంగళవారం ఎయిమ్స్‌కు వచ్చి వాజపేయి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here