తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కధ ఆధారంగా చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా సైరా . ఈ చిత్రంలో నయనతార , తమన్నా కథానాయికలుగా నటిస్తున్నారు . ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు . ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బ్రిటిష్ వాళ్ళు తెలుగు జాతి పై దాడి చేయడానికి తమ కోటలో ఆయుధాలు దాచిపెట్టడంతో నరసింహారెడ్డి వారి పై దాడి చేసి బ్రిటిష్ సైనికులను హతమార్చి ఆయుధాలు స్వాధీనం చేసుకునే నేపథ్యంలో ఉన్న సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట . ప్రస్తుతం వేసిన పెద్ద కోట సెట్ లో ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట .

ఈ ఫైట్ సీక్వెన్స్ ని ప్రముఖ హాలీవుడ్ స్టెంట్ మాస్టర్ గ్రెగ్ పావెల్ తో తెరకెక్కిస్తున్నారు . ‘జేమ్స్‌బాండ్‌’ సిరీస్‌లో వచ్చిన ‘స్కై ఫాల్‌’, ‘హ్యారీపోట్టర్‌’ సిరీస్‌లో కొన్ని చిత్రాలకు, ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ చిత్రాలకు యాక్షన్‌ సీక్వెన్సులు కంపోజ్‌ చేశారు పావెల్‌. ‘సైరా’ లోని యుద్ధ సన్నివేశాలను కూడా గ్రెగ్ పావెల్ బ్రహ్మాండంగా డిజైన్‌ చేస్తున్నారట . ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , జగపతిబాబు , విజయ్ సేతుపతి , బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments