మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచినా సినిమా గ్యాంగ్ లీడర్ . విజయబాపినీడు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించారు . ఈ సినిమా అప్పట్లో అఖండ విజయం సాధించి ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది . అయితే  రాంచరణ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి గ్యాంగ్ లీడర్ సినిమా రీమేక్ కు సంబందించిన చర్చలు జరుగుతున్నాయ్ . మెగా స్టార్ పాత్రలలో తనయుడు రాంచరణ్ ను చూసుకునేందుకు అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు . ఇక ఆ ఎదురుచూపులు సమయం ముగిసినట్టేనని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది .

ఇటీవల జరిగిన తేజ్ ఐ లవ్ యు సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే క్రియేటివ్ కమర్షియల్స బ్యానర్ లో చరణ్ సినిమా ఉండనుందని హింట్ ఇచ్చారు . బహుసా ఇదే గ్యాంగ్ లీడర్ రీమేక్ అయ్యుండొచ్చు అన్న ప్రచారం జరుగుతోంది . కాకపోతే పాత కధను ఇప్పటి ట్రెండ్ కు ట్యూన్ చేసి తెరకెక్కించేందుకు నిర్మాత కేఎస్ రామారావు ప్రయత్నిస్తున్నారని సమాచారం . రాజమౌళి మల్టీస్టారర్ సినిమా పూర్తి అవ్వగానే ఈ సినిమా పట్టాలేక్కనుందట . మరి ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తారో చూడాలి .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments