తెలుగు సినీ పరిశ్రమలో ఈమధ్య అందరూ బయోపిక్ మంత్రం జపిస్తున్నారు . ఇప్పటికే ఎన్టీఆర్ , వైఎస్ఆర్ బయోపిక్ లు రూపొందుతున్నాయి . అయితే ఇప్పుడు ఫిలిం నగర్ లో మరొక బయోపిక్ కు సంబందించిన వార్త హల్చల్ చేస్తోంది . ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు , జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా బయోపిక్ రూపొందనుందట . దాదాపు 2 సంవత్సరాలనుండి ఈ బయోపిక్ రూపొందనుందని వార్తలు వస్తూ ఉన్న ఆలస్యమవుతూ వచ్చింది . కానీ ఈ సారి కచ్చితంగా ఈ సెప్టెంబరులో చిత్రీకరణ మొదలు కానుందట .

తెలుగు , హిందీ బాషలలో ఏక కాలంలో రూపొందనున్న ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సుదీర్ బాబు గోపీచంద్ పాత్రలో కనిపించనున్నారు . ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్సకత్వం వహించనున్నారు . ఈ చిత్రం లో వివాదాస్పద విషయాలకు పోకుండా కేవలం ఆటకు సంబందించిన అంశాలతోనే రూపొందించనున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments