ప్రముఖ సినిమా రచయత పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పరుచూరి పలుకులు పేరుతో తన గత అనుభవాలు అన్నింటినీ పంచుకుంటుంటారు . తాజాగా ఈ కార్యక్రమంలో పరుచూరి తాను దర్శకత్వం వహించిన సర్పయాగం సినిమా విశేషాల గురుంచి ప్రస్తావించారు . సర్పయాగం సినిమా కోసం రోజాను తీసుకున్నప్పుడు ఆ అమ్మాయి ప్రత్యేకత ఏమిటని రామానాయుడు గారు అడిగారని అందుకు ఆయన బదులుగా ఆ అమ్మాయి నవ్వినప్పుడు చూడండి సార్ , ఆ నవుఉలో మన తెలుగింటి ఆడపడుచు ఆత్మీత్యత ఉందని చెప్పన్నాని తెలియజేశారు .

ఆ సినిమా షూటింగ్ సమయం గురుంచి గుర్తుచేసుకుంటూ షూటింగ్ సమయంలో రోజా తనను డాడీ అని పిలిచేదని తెలిపారు . అప్పట్లో తన చిటికెన వ్రేలుకి ఒక గోల్డ్ రింగ్ ఉండేదని , ఒకరోజు రోజా “డాడీ ,ఈ సినిమా 100 రోజులు ఆడితే నాకు ఈ ఉంగరం ఇచ్చేస్తావా ? ” అని అడగగా తాను “నీ నోటి మాట వలన నిజంగా 100 రోజులు ఆడితే ఆ ఫంక్షన్ లోనే ఇచ్చేస్తానమ్మా” అని బడులిచ్చానని అన్నారు . తరువాత ఆ చిత్రం 100 రోజులు ఆడగా ఆరోజు ఫంక్షన్ లో “ఇదిగోనమ్మా నువ్వు అడిగిన ఉంగరం అని చెప్పేసి ఇచ్చేశాను” అని చెప్పుకొచ్చారు .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments