వైసీపీ నాయకులు సిగ్గు లేకుండా …

497

నిన్న ప్రజాసంకల్ప యాత్ర రాజముండ్రి సభలో జగన్ మాట్లాడుతూ వై ఎస్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరిగేవని , ఇప్పుడు చంద్రబాబు పాలనలో పనులు నత్త నడకన జరుగుతున్నాయని , చంద్రబాబుకు పోలవరం పై చిత్తశుద్ధి లేదని విమర్శించిన విషయం తెలిసినదే . దానికి సమాధానంగా ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు . ఆయన ట్వీట్ చేస్తూ పోలవరం పనులు సీఎం చంద్రబాబు చేతికి వచ్చాకే వేగంగా జరుగుతున్నాయని , ఇప్పటికే 55 శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు . కానీ వైసీపీ నాయకులు మాత్రం సిగ్గు లేకుండా పోలవరం వైఎస్ కల అంటూ ఆయన పేరును అనవసరంగా తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు . ఇదంతా చూస్తూ ఉంటే విజయానికి ఎంతో మంది తండ్రులు , అపజయం అనాధ అన్నది గుర్తుకు వస్తోందని లోకేష్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here