నా కుటుంబం చాలా స్ట్రాంగ్ …

584

తెలుగు తెరపై తన సహజమైన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే నటులలో న్యాచురల్ స్టార్ నాని ఒకరు . చిత్ర పరిశ్రమలో ఎటువంటి సపోర్ట్ లేకుండా తానే స్వయంగా కష్టపడుతూ స్టార్ హీరో స్థాయికి ఎదిగారు . అటు వెండి తెర మీదే కాక ఇప్పుడు బుల్లి తెర పైన కూడా బిగ్ బాస్ 2 హోస్ట్ గా దూసుకుపోతున్నారు . సోషల్ మీడియాలో కూడా నాని ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ తన వ్యక్తిగత , సినిమా విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు . అయితే తాజాగా నాని పెట్టిన ఒక ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది . ఆయన త్వీట్ ద్వారా “నా కుటుంబం ఇప్పుడు మూడు మిలియన్లు … ఎంతో స్ట్రాంగ్” అని పేర్కొన్నారు . ఈ త్వీట్ అర్ధం తన ట్విట్టర్ ఫోల్లోవేర్ల సంఖ్యా మూడు మిల్లియన్లు అంటే అక్షారాలా 30 లక్షల మంది అని అర్ధం . నాని ఈ విధంగా ఆ విషయాన్ని తెలియజేయడంతో అభిమానులు సంతోషపడుతున్నారు . ప్రస్తుతం నాని నాగార్జునతో కలిసి ఒక మల్టీస్టారర్ లో నటిస్తున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here