తిరుపతి మెట్లెక్కి బాబు ఓడిపోవాలని కోరుకుంటా …

618

ఏపీ సీయం చంద్రబాబు పై తెలంగాణ తెలుగుదేశం బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు .  యాదాద్రి జిల్లా ఆలేరులో మోత్కుపల్లి విలేఖరులతో మాట్లాడుతూ  చంద్రబాబు నడిపే తెలుగుదేశం పార్టీ దుర్మార్గపు పార్టీ అని , ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు అవినీతి ప్రదేశ్ గా మార్చారని అన్నారు . ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగలు చంద్రబాబు ,రేవంత్ రెడ్డిలేనని ఎందుకు వాళ్ళపై చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు . ఎపీకి ప్రత్యేకహోడా కోసం మాట్లాడుతోంది వైఎస్ జగన్ , పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు కాదని అన్నారు . ఎన్టీఆర్ కుటుంబాన్ని మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు . కాపులకు , బీసీలకు , బ్రాహ్మణులకు చంద్రబాబు గొడవ పెట్టారని , రాబోయే ఎన్నికలలో ఓటమి తధ్యం అని , ఈ వ్యవస్థలో ఉన్న చీడ పురుగు చంద్రబాబు అని మోత్కుపల్లి మండిపడ్డారు . టీడీపీని చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబానికి అప్పజెప్పాలని , లేకపోతే ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెప్తారన్నారు . ఇంకా మాట్లాడుతూ తనకు మోకాళ్ళ నొప్పులు ఉన్న కూడా తిరుపతి మెట్లు ఎక్కి చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుకుంటానని మోత్కుపల్లి అన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here