ఇండియాలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫిట్నెస్ ఛాలెంజ్ ట్రెండ్ నడుస్తోంది . హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ పేరుతో కేంద్ర మంత్రి మొదలు పెట్టిన ఈ ఛాలెంజ్ లో చాలా మంది సినీ సెలబ్రిటీలు , క్రీడాకారులు భాగమయ్యారు . విరాట్ కోహ్లి తన ఫిట్నెస్ వీడియో ను పోస్ట్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సవాల్ చేసిన విషయం తెలిసినదే . ఇప్పుడు దానికి బదులుగా మోదీ తను యోగా చేస్తున్న వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . వీడియో లో పంచభూతాలైన భూమి , నీరు , అగ్ని , గాలి , ఆకాశంతో మమేకమైతే ఎంతో ప్రేరణ పొందోచ్చని , ఆపై ఉత్సాహంగా రోజు సాగుతుందని మోదీ వ్యాఖ్యానించారు . ఈ వీడియో పోస్ట్ చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి హేబ్డీ కుమారస్వామి , కామన్వెల్త్ క్రీడల పతక విజేత మోనికా బాత్రా , 40 ఏళ్ల వయసు దాటిన ఐఏఎస్ అధికారులందరికీ ఛాలెంజ్ విసిరారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments