మోదీ కు కన్నా అందజేసిన వినతి పత్రం పై లోకేష్ సెటైర్ …

0
224

ప్రధాని మోదీతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయినా విషయం తెలిసినదే . ఈ భేటీలో ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు , ఎన్నికలకు పార్టీను సన్నద్ధం చేయడం , బీజేపీ పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదురు దాడి , ఇతర పార్టీల కార్యాచరణ తదితర అంశాల పై చర్చలు జరిపినట్టు సమాచారాం . ఈ మేరకు మోదీ కు కన్నా ఓ వినతి పత్రం అందజేశారు .

ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ లేఖను లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ బీజేపీ అందజేసిన లేఖ ఇది. ఆశ్చర్యమేస్తోంది , ఏపీకి 90 శాతం హామీలు నెరవేర్చామని బీజేపీ చెప్పుకోవడం నిజమే అయితే కనుక, మరిప్పుడు కుతుబ్ మినార్ అంత పొడవుగా ఉన్న ఈ కోరికల లిస్టేమిటి? ఈ జాబితాలో ప్రత్యేకహోదా గురించి ఎందుకు ప్రస్తావించలేదు? అసత్య ప్రచారాలను ఆపి, ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలి’ అని లోకేశ్ డిమాండ్ చేశారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here