ఆంధ్రప్రదేశ్ ను పాలించే అర్హత నారా చంద్రబాబు నాయుడు కి లేదని వైఎస్ఆర్సీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి అన్నారు . నాలుగేళ్ల పాలనలో 4 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు . చంద్రబాబు రైతులతో సహా అందరినీ మోసం చేశారని మండిపడ్డారు . పాద యాత్ర లో జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు భయపడుతున్నారన్నారు .

ఇంకా మాట్లాడుతూ చంద్రబాబు కు సొంత పార్టీ జెండా లేదని , నందమూరి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీను అప్పజెప్పాలని లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు . 2014 లో పేర్కొన్న 600 హామీలలో ఎ ఒక్క హామీను కూడా చంద్రబాబు నెరవేర్చలేదని అన్నారు . చంద్రబాబు నిజంగా నిజాయితీపరుడైతే ఆయనపై ఉన్న ఆరోపణల పై సీబీఐ తో విచారణ జరిపించాలని లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments