ఉత్తమ్ ట్వీట్ కు కేటీఆర్ రెస్పాన్స్ …

0
299

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ వృద్ధ జంట గుడిలో నివాసితున్నారని , వారికి కూడా రూ . 500 ఇంటి పన్ను వేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ సీఎం ఓ తో పాటు మంత్రి కేటీఆర్ కి ట్వీట్ చేశారు . వారికి ఆ డబ్బు తిరిగి చెల్లించాలని , అలాగే వెంటనే వారికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజారు చేయాలని డిమాండ్ చేశారు . అయితే ఈ విషయం పై కేటీఆర్ స్పందిస్తూ వారి సమస్యను తన దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు . స్థానిక పంచాయతీ సెక్రెటరీకి ఈ విషయం తెలిపి, తప్పును సరిదిద్దుకునేలా చేయాలని ఆ జిల్లా కలెక్టర్‌కి కేటీఆర్ సూచించారు. అలాగే, వారికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఇవ్వాలని, వారికి ఆసరా పెన్షన్‌ అందుతోందో లేదో తెలుసుకుని, అందకపోతే వచ్చేలా చేయాలని ఆదేశించారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here