తిరుమల వివాదం శ్రీవారి సృష్టే …

0
268

కొన్ని రోజులుగా తిరుమలలో వివాదాలు తల్లెత్తుతున్న విషయం తెలిసినదే . ఈ విషయం పై చాల మంది స్పందించారు . కానీ , తాజగా ఈ విషయం పై తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు , టీటీడీ మాజే ఈఓ కేవీ రమణాచారి చాలా విభిన్నమైన రీతిలో స్పందించారు . ఈ విషయం గురుంచి ఆయన మాట్లాడుతూ తిరుమలలో నెలకొన్న వివాదం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సృష్టేనని , ఆయనే ఏ కారణం చేతనో ఈ వివాదం సృష్టించారని అన్నారు . ఇంకా మాట్లాడుతూ తిరుమల కొండపై ఏదో మార్పును స్వామివారు కోరుకుంటున్నారని , అందుకే ఈ వివాదం వచ్చిందని అభిప్రాయపడ్డారు . స్వామివారి ప్రతిష్టకు భంగం కలగకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని అన్నారు . స్వామివారి ఆజ్ఞ లేనిదే తిరుమల కొండపై ఏదీ జరగదని , ఈ విషయం తనకు బాగా తెలుసునని అన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here