ఏపీ విషయంలో అమిత్ షా చాలా ఎమోషనల్ గా ఫీలయ్యారు …

546

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ , జీవీఎల్ నరసిమహరావు తదితర నేతలు డిల్లీలో కేంద్ర పెద్దలతో సమావేశమయ్యారు . అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత ఏపీకి అన్యాయం జరిగిందని అమిత్ షా తమతో ప్రస్తావించారన్నారు . అమిత్ షా ఏపీ విషయంలో చాలా ఎమోషనల్ గా ఫీలయ్యారని , ఏపీ పై ఆయన చూపిస్తున్నఅభిమానాన్ని చూస్తుంటే ఒక తెలుగు బిడ్డగా తాను ఎంతో గర్విస్తున్నానని అన్నారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పై జీవీఎల్ విమర్శలు చేశారు . ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన బాధ్యతలను వదిలేసి , కేవలం తన పార్టీ గురుంచే పట్టించుకున్తుంటున్నారని , టీడీపీ కి ప్రచారం తప్ప చంద్రబాబు రాష్ట్రానికి చేసింది ఏమి లేదని అన్నారు . ఏపీలోని ప్రతీ ప్రాజెక్టులో టీడీపీ ప్రభుత్వానికి తమ వాటా ఎంతన్నదే ముఖ్యమని , ఏ ప్రాజెక్టు అయితే వాటాలు తెచ్చిపెట్టవో ఆ ప్రాజెక్టును టీడీపీ వద్దు అంటున్నదని , అధికారంలో ఉండగానే ఆ పార్టీ నేతలు ఎంత డబ్బు సంపాదించుకుందాము అనే ధ్యాసలో ఉన్నారన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here