ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోండి …

0
172

సామాజిక సమస్యలపై స్పందించడంలో నటుడు ప్రకాష్ రాజ్ ఎప్పుడు ముందుంటారు . తాజా మరో మారు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ దేశంలో విద్యావ్యవస్థ మాఫియా చేతులలోకి వెళ్లిపోయిందని , స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు అవుతున్నా దేశంలోని 70 శాతం గ్రామాలలో విద్య అందని ద్రాక్షగానే మిగిలినదని ఆవేదన వ్యక్తం చేశారు . గ్రామీణ బాలలకు నాణ్యమైన విద్య అందడం లేదన్న ఆయన దీనికి ఒక ఆలోజింపజేసే పరిష్కారాన్ని కూడా ఈ సందర్భంగా సూచించారు .

ప్రతీ నటుడు , జాతీయ స్థాయి క్రీడాకారులు , పారిశ్రామికవేత్తలు ఇలా ప్రతి ప్రముఖులైన ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలని సూచించారు . ఇలా చేయడం వాళ్ళ విద్యావ్యవస్థలో గణనీయమైన మార్పు కనిపిస్తుందన్నారు . ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , తమిళనాడులోని ఒక్కొక్క పాఠశాల దత్తత తీసుకోవాలని ఉందని పేర్కొన్నారు . ఆ పాఠశాలలను దత్తత తీసుకొని వాటికి మౌలిక సదుపాయాలూ కల్పిస్తానని , మూడు నెలలకొకసారి సందర్శిస్తానని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు . కాగా, కర్ణాటకలోని మేణసగెరె గ్రామంలోని ఓ పాఠశాలను ఇప్పటికే దత్తత తీసుకున్న ప్రకాశ్ రాజ్, మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన విద్య కోసం కృషి చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here