వైసీపీ అధినేత వై ఎస్ జగన్ తమను అవమానించారని ఏపీ బ్రాహ్మణ సంఘాల సమాఖ్య ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు . జగన్ వస్తారన్న భరోసాతో తాము రాజముండ్రి లో బ్రాహ్మణ ఆత్మీయ సభను ఏర్పాటు చేశామని , ఈ సభకు 13 జిల్లాల నుండి బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు చేరుకున్నారని అన్నారు . జగన్ సభకు రాకుండా తమ మనోభావాలను గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు .

తమకు జరిగిన అవమానానికి సంబంధించి రాజముండ్రి లోని ఒక హోటల్ లో బ్రాహ్మణ సంఘాల నేతలు అత్యవసర భేటీ అయ్యి జగన్ తీరు , తమ భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు . చర్చల అనంతరం బ్రాహ్మణ సంఘాల నేతలు మాట్లాడుతూ రెండు రోజుల లోగా వైసీపీ నేతలు స్పందించాలని , లేకపోతే తాము వైసీపీ కి వ్యతిరేకంగా పనిచేస్తామన్నారు . ఇంకా మాట్లాడుతూ తాము చేపట్టబోయే బస్సు యాత్రలో జగన్ చేసిన అవమానాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments