కొన్ని రోజులుగా ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ మార్చుతున్నట్టు విపరీతమైన ప్రచారం జరుగుతోంది . ఈ విషయం గురుంచి ఒక విలేఖరి ఆయనను అడగగా ఆనం రామనారాయణ రెడ్డి బదులిస్తూ గౌరవం లేని చోట తాను ఉండలేనని తేల్చి చెప్పారు . తాను గతంలో ఎన్నో పదవులు చేపట్టి సమర్ధవంతంగా పని చేశానని పేర్కొన్నారు . తనకు గుర్తింపు , గౌరవం లేని చోట తాను ఉండలేనని తెలియజేశారు . ఇంకా మాట్లాడుతూ నెల్లూరు జిల్లా అంతా తమ కుటుంబానికి సన్నిహితులు , అనుచరులు , అభిమానులు ఉన్నారని వారందరితో చర్చించిన తరువాత మాత్రమే పార్టీ మారడం పై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు . సూళ్లూరుపేటలోనూ తనకు సన్నిహితులు ఉన్నారని , వారితో కూడా మాట్లాడిన తరువాతే తన రాజకీయ భవిష్యత్తు పై సరైన నిర్ణయం తీసుకుంటానని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments