వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజసంకల్ప యాత్ర పాదయాత్ర గోదావరి రోడ్ కం రైల్ బ్రిడ్జి మీదుగా తూర్పు గోదావరి జిల్లాకు చేరుకుంది . ఈ సందర్భంగా వై ఎస్ జగన్ రాజమహేంద్రవరం , శ్యామల ధియేటర్ వద్ద ఏర్పాడు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు సినిమాలు చూపిస్తున్నారని అన్నారు . అందులో ఒకటి రాజధాని అమరావతి కాగా , రెండోవది పోలవరం అని అన్నారు . చంద్రబాబు మొదటి సినిమాను చూపిస్తూ అదిగో సింగపూర్ .. అదిగో జపాన్ .. ఇదిగో రాజధాని అమరావతి అంటారని జగన్ ఎగ్దేవా చేశారు . మొదటి సినిమాను ఈ విధంగా చూపిస్తుంటే రెండోవ సినిమా పోలవరం ప్రాజెక్టును కూడా మోసాలతో చూపిస్తున్నారని మండిపడ్డారు . కాస్త కలెక్షన్లు ఎక్కువ రావడానికి ప్రతి సోమవారం పోలవరం అంటూ అక్కడకు వెళ్తున్నారని విమర్శించారు . ఇంకా మాట్లాడుతూ పోలవరం సినిమా ఎలా ఉందంటే మొన్న పునాది గోడలను జాతికి అంకితం చేసి , డయాఫ్రం వాల్ అంటూ ఎన్నో అసత్యాలను చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకొచ్చిందన్నారు . ఈ పరిణామాలు చూస్తూ ఉంటె ఒకే ఇంటికి ఆరు సార్లు శంకుస్థాపన చేసినట్టు ఉందన్నారు .

నాలుగేళ్ళుగా చంద్రబాబు ఈ విధంగానే మోసం చేస్తున్నారని అన్నారు . పోలవరం ప్రాజెక్టు ఆయన కల అని చంద్రబాబు అంటున్నారు కానీ ఇంతక ముందు ఆయన 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా పోలవరం కోసం ఏమి చేయలేదని విమర్శించారు . అప్పట్లో ఎమ్మెల్యే వడ్డీ వీరభద్రరావు పోలవరం ప్రాముఖ్యత తెలిపేందుకు 3000 కిలోమీటర్లు సైకిల్ పై యాత్ర చేసినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు . ఆ తరువాత వైఎస్ఆర్ హయాంలో పనులు వేగంగా జరిగాయని , తరువాత మళ్ళీ చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు నత్త నడకన సాగుతున్నాయని , చంద్రబాబు పోలవరం విషయంలో చిత్తశుద్దితో లేరన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments