వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తరచూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడుతున్న విషయం తెలిసినదే . తాజా ఆయన మళ్ళీ చంద్రబాబును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యాలు చేశారు . ఆయన మాల్తాడుతూ ఏపీకి చంద్రబాబు ఓ దౌర్భ్యాగ్యపు ముఖ్యమంత్రి అని అన్నారు . లేనిది ఉన్నట్టుగా , ఉన్నది లేనట్టుగా ప్రచారం చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరన్నారు . పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఒక్క రోజులోనే 13 వేల క్యూబిక్ మీటర్ల పనులను చేశామని చంద్రబాబు అన్నారని , అదే విషయం తిరుమల వెంకన్న మీద ప్రమాణం చేసి చెప్పగలరా ? అని విజయ్ సాయి రెడ్డి ప్రశ్నించారు . అబద్దపు ప్రచారాలతో చంద్రబాబు తెలుగు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు . తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులును తాను కలవాలని అనుకోలేదని , కానీ చంద్రబాబు వ్యాఖ్యల నేపధ్యంలో తాను మొత్కుపల్లిని కచ్చితంగా కలుస్తానని అన్నారు . ఒక దళిత నేతను కలిస్తే తప్పేముందని , మొత్కుపల్లిని తాను కలిస్తే చంద్రబాబుకు ఎందుకంత భయం అని అన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments