భారత దేశ మాజీ ప్రధాని , భారతరత్న వాజీ పేయి నిన్న మూత్రపిండాలు , ఊపిరితిత్తుల సమస్యతో డిల్లీ లోని ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం అడ్మిట్ అయ్యారు . ఇప్పుడు తాజాగా ఆయనకు సంబంధించి హెల్త్ బులిటెన్ ను ఎయిమ్స్ వైద్యులు విడుదల చేశారు . వాజీ పేయి ను ఐసీయూ లో ఉంచి చికిత్స అందిస్తునట్టు , ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు గమనిస్తోందని , చికిత్సకు వాజీ పేయి స్పందిస్తున్నారని ఈ బులిటెన్ లో వైద్యులు తెలిపారు . కాగా ,శరీరంలోని పలు అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకిన వాజీ పేయి పరిస్థితి గురుంచి తెలుసుకునేందుకు ఎయిమ్స్ వద్దకు బీజేపీ శ్రేణులు వస్తుండడంతో ఆ ప్రదేశంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు . ఈ ఉదయం కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎయిమ్స్ కు వెళ్లి వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments