తనను పదే పదే కించపరుస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్న సినీ నటి శ్రీరెడ్డికి హీరో నాని లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసినదే . నాని తన లాయర్ల ద్వారా నోటీసులు పంపారు . ఏడు రోజుల్లోగా సిటీ సివిల్ కౌర్టులో శ్రీరెడ్డి సమాధానం చెప్పాలని నాని లాయర్లు తెలిపారు . అయితే ఈ విషయం పై శ్రీరెడ్డి స్పందించారు . తాను కూడా చట్టపరంగా పోరాడతానని ఆమె ట్వీట్ చేశారు . ఈ నేపథ్యంలో మళ్ళీ నాని పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు . “నాని , తెర బయట ” నీ అంత మంచోడు లేనట్టు ఫోజులు ఇస్తున్నావ్ , నీ నిజ స్వరూపం తెలిస్తే నీ కుటుంబసభ్యులు , ప్రజలు నీ మొహం మీద ఉమ్ముతారు . ఛీ ఛీ . అని ట్వీట్ చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments