మంచి పని చేసి విమర్శల పాలైన సచిన్ …

640

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మానవత్వంతో మంచి పని చేసి మరీ విమర్శలు ఎదురుకుంటుంన్నారు . అసలు విషయం ఏమిటంటే సచిన్ ఇంటి బాల్కనీలోకి ఓ పక్షి వచ్చింది , అది చాలా దయనీయమైన స్థితిలో లేవలేని పరిస్థితి లో ఉంది . దాన్ని అలా చూసి చలించిన సచిన్ దానికి ఆహారాన్ని , నీటిని అందించారు . అయినా కూడా పక్షి కదలలేకపోవడంతో ఆయన ఒక ఎన్జీవో కు ఫోన్ చేయగా , ఎన్జేఒ సభ్యులు వచ్చి వైద్యం అందించారు . మూడు రోజుల తరువాత పక్షి పూర్తిగా కోలుకొని , స్వేచ్చగా గాలిలోకి ఎగిరింది . అయితే దీనికి సంబందించిన వీడియోను సచిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . చాలా మంది ఈ వీడియో చూసి సచిన్ యొక్క మానవత్వం గురుంచి ప్రశంసించగా కొందరు మాత్రం అన్ని జీవులపై ఇలాంటి ప్రేమనే చూపించాలని , మాంసాహారం మానేసి , శాఖాహారమే భుజించాలని , మీరు నిర్వహించే హోటళ్ళలో కూడా శాఖాహారాన్నే అందించాలంటూ సెటైర్లు వేశారు .

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here