రిలయన్స్ జియో అదిరిపోయే ఆఫర్ …

626

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో ప్రత్యేక ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను ప్రకటించింది. ప్రతి ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై రోజూ 1.5 జీబీ అద‌న‌పు డేటా అందిస్తున్నట్లు తెలిపింది. ఈ రోజు సాయంత్రం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఈ అదనపు డేటా అందుకోవచ్చు. రూ.149, రూ.349, రూ.399, రూ.449, రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్లాన్ల‌కు అదనంగా రోజుకు 1.5 జీబీ డేటా చొప్పున అదనంగా అందుకోవచ్చు.

అలాగే, రూ.509 ప్లాన్‌తో రీచార్జ్‌ చేసుకుంటే రోజుకు 4 జీబీ డేటాకు బ‌దులుగా 5.5 జీబీ డేటా, రూ.799తో రీచార్జ్‌ చేసుకుంటే రోజుకు 5 జీబీ డేటాకు బ‌దులుగా 6.5 జీబీ డేటా వస్తుంది. అలాగే, రూ.399 ప్లాన్‌ను జియో యాప్‌లో ఫోన్‌పే ద్వారా రీచార్జి చేసుకుంటే రూ.100 డిస్కౌంట్ లభించే ఆఫర్‌ను కూడా పొడిగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here