టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని పై నటి శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసినదే . కొన్ని సందర్భాలలో చెప్పకూడని బాషను వాడుతూ నాని పై శ్రీరెడ్డి విరుచుకు పడుతున్నారు . దీనికి సంబంధించి నాని నిన్న తన లాయర్ల ద్వారా శ్రీరెడ్డి కి లీగల్ నోటీసులు పంపడం , దీనికి బదులుగా తాను కూడా లీగల్ గానే వెళతానని సోషల్ మీడియా ద్వారా సమాధానం ఇవ్వడం జరిగింది .

అయితే ఇప్పుడు ఈ విషయం పై నాని భార్య అంజనా ట్విట్టర్ ద్వారా స్పందించారు . “సినీ పరిశ్రమ చాలా గొప్పదే అయినప్పటికీ , పబ్లిసిటీ కోసం కొందరు వ్యక్తులు ఇతరుల జీవితాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు . వారు చేసున్న నీచమైన కామెంట్లను ఎవరూ నమ్మరు . వారి వ్యక్తిగత జీవితాలను దిగాజార్చుకోవడానికి కూడా వారు ఎలా సిద్ధపడుతున్నారో ” అంటూ ట్వీట్ చేశారు . మరి ఈ ట్వీట్ పై శ్రీరెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments